Business Plan for fresh Engineers

ఫ్రెండ్స్ లో ఎవరైనా Mtech కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు, లేదా కలెక్టర్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా  జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటె  వాళ్ళు ఉంటారు కదా...

వాళ్లకు GATE  రాంక్ వచ్చి MTech జాయిన్ అవ్వడానికి టైం ఉంటుంది కదా..

అలాగే అందరికీ ఒకేసారి జాబ్స్ రావు కదా..

1 జాబ్ కోసం 1000 మంది కొట్టుకుంటున్నారు...

కొన్ని  నెలల టైం పడుతుంది కదా...

కలెక్టర్ అవ్వాలి బ్యాంకు లో పని కావాలి అనుకుని చదివేవాళ్ళుకు అయితే కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది ...

వాళ్ళు అందరూ ఒక గ్రూప్ లాగా జాయిన్ అయ్యి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా చిన్నది పెట్టమని చెప్పు..

 

ఆఫీస్ ఏమీ అవసరం లేదు..

అందరూ ఫ్రెండ్స్ కదా...

ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చుని పని చెయ్యాలి ...

టీమ్స్ లో మీటింగ్స్ పెట్టుకోవాలి ...

ఎప్పుడైనా కలవాలి అని ఇంపార్టెంట్ మీటింగులు కోసం ఒక్కోసారి ఒక్కొక్కరి ఇంట్లో డాబా మీద అలా మీటింగులు పెట్టుకోవాలి...  

అనవసరంగా డబ్బులు వాడకూడదు..

అందరూ జీతం లేకుండా వాళ్ళ కంపెనీ లో పని చెయ్యాలి అని ఒప్పదం రాసుకోవాలి...  

తర్వాత అందరూ కలిసి ఆ కంపనీ లో ప్రాజెక్ట్ లు అంటే ఏవైనా యాప్ లు చేయడం లేదా సాఫ్ట్వేర్ తయారు చెయ్యడం లాంటివి చేస్తూ ఉండాలి ...

 

వీళ్ల కంపెనీ లో  ప్రోజెక్టుల కోసం వాళ్ళు చేస్తున్న పనులను కూడా జాబ్స్ కి అనుభవం కింద పెట్టుకోవచ్చు...

ఒకవేళ Amazon లాగా ఒకటి చిన్నది తయారు చేస్తున్నాము... లేదా కూరగాయాల షాప్ లకు ఒక బిల్లింగ్ యాప్ తయారు చేసాము, లేదా సరుకులు లేదా భోజనం డెలివరీ చేసేలా  ఒక యాప్ చేస్తున్నాము అలా వాళ్ళు వాళ్ళ కంపెనీ లో ఎం చేసినా అవన్నీ అనుభవం కింద పెట్టొచ్చు...

అప్పుడు ఎం చేసాము అని చెప్తారో వాటిల్లో ప్రశ్నలు అడిగి పనిలోకి తీసుకుంటారు...

 

ఎవరికైనా జాబ్ వస్తే అప్పుడు అతనికి జీతం వస్తుంది కాబట్టి, అతని ప్లేస్ లో ఇక్కడ ఇద్దరు మనుషులను అతను జీతం ఇచ్చి పనికి పెడితే , వాళ్ళచేత పనిచేయించుకుంటూ మిగతావాళ్ళు కంపెనీ నీ చూసుకుంటారు...

ఒకవేళ అందరికీ జాబ్ వచ్చేసినా సరే కంపెనీ మాత్రం తీసెయ్యకుండా ఉండేలా పని వాళ్ళతో పని చేయించుకుంటూ ఒకరు ఎప్పుడు దగ్గరుండి చూసుకునేలా, ఒక ఫ్రెండ్ మాత్రం ఏ జాబ్ కి వెళ్లకుండా కంపెనీలో నే మేనేజర్ లాగా ఉండిపోవాలి అని చెప్పి అతనికి వీళ్లకు వచ్చిన జీతం లో వాళ్ళు వాటా ఇవ్వాలి అని ముందుగానే ఒప్పందం రాసుకోవాలి...

జాబ్ వచ్చిన వాళ్ళు కూడా రోజుకు 4 గంటల పాటు ఇంకా శని ఆదివారాలు సొంత కంపెనీ అభివృద్ధి చెయ్యడానికి కష్టపడాలి అని ముందే రాసుకోవాలి ...

 

అలా అందరూ కస్టపడి జీతం లేకుండా ప్రాజెక్టులు చేస్తూ ఉంటె, ఒక 2, 3  సంవత్స్రాలలో వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది...

అప్పుడు ఆ ప్రాజెక్ట్ ని షాపులకు ఫ్రీగా ఇచ్చి, యాప్ ఎలా వాడాలి అని నేర్పించి, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తాము అని ఒక కస్టమర్ కేర్ నెంబర్ లాగా మేనేజర్ నెంబర్ ఇవ్వాలి --  

బాగా అలవాటు అయ్యాక, కంపెనీ మీద షాప్ ఓనర్లకు నమ్మకం వచ్చాక, బాగా వ్యాపారం చేసేవాళ్లకు మాత్రం నెలకు 1,000 కట్టాలి , 2000 కట్టాలి, 5000 కట్టాలి  అని వాళ్ళ వ్యాపారాన్ని బట్టి పెంచాలి ...

 

ఒకవేళ 3 సంవత్స్రాలు దాకా జీతం లేకుండా  ప్రాజెక్ట్ చేస్తూ ఉండాలి అంటే కుదరదు అనుకుంటే,

అప్పుడు అమెరికా నుంచి ఆన్లైన్ లో చాలా ప్రాజెక్ట్ లు కావాలి అని అడుగుతారు..

అవి తీసుకుని అందరూ కలిసి చేసి, లక్షా 2 లక్షలు అలా డబ్బులు వస్తే, వీళ్లు జీతంలాగా  ఖర్చుపెట్టుకోవడానికి తీసుకోకుండా ఆ డబ్బులతో పనివాళ్లను పెట్టుకుని వాళ్లకు ప్రాజెక్ట్లు ఎలా చెయ్యాలి అని నేర్పించి, వాళ్ళ చేత కూడా చేయిస్తే చాలా త్వరగా ప్రాజెక్ట్  పూర్తి అయిపోతుంది...

 

వీళ్ళ కంపెనీ లో ఒక 100 మంది నెల నెలా డబ్బులు కట్టే కస్టమర్లు వస్తే అప్పుడు కనీసం నెలకు 2 లక్షలు చొప్పున కంపెనీకి నెలా నెలా వస్తాయి..

అప్పుడు ఒకడు పని మానేసి ఈ కంపెనీ లో ఫుల్ టైం చూసుకుంటూ జీతం తీసుకోవాలి...

అలా ఒక 1000 మంది కస్టమర్లు వస్తే నెలకు 20 లక్షలు అలా వస్తాయి కాబట్టి అందరూ పని మానేసి ఈ కంపెనీని అభివృద్ధి చెయ్యడానికి, ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్లు యాప్ లు చేయడానికి  కష్టపడాలి...

 

అలా అందరితో కలిసి కూర్చుని మహేష్ ని మాట్లాడమని చెప్పు ..

ప్రాజెక్ట్ లు ఎం చెయ్యాలి అని ఐడియాస్ కోసం అందరూ కలిసి ఆలోచించి డిసైడ్ అవ్వాలి...

 

చదువుకున్న అందరూ పనికి మాత్రమే వెళ్ళాలి అని చట్టం ఏమీ లేదు..

ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద కంపనీలు పెట్టిన వాళ్ళు అందరూ సరిగ్గా కాలేజీకి వెళ్లకుండా మజ్జిలోనే కాలేజీ మానేసిన వాళ్ళు, ఉద్యోగాలు దొరకని వాళ్ళు, అస్సలు కాలేజీకే వెళ్లని వాళ్ళు, పని పోయిన వాళ్ళు, పని చెయ్యలేక మానేసిన వాళ్ళు పెట్టిన కంపెనీలే..

పని చేసేవాడు రోజుకు 12 గంటలు వాళ్ళ కంపెనీ పెంచడం కోసం పని చేస్తే, ట్రాఫిక్ లో రోజుకు 4 గంటలు వాళ్ల ఆఫీసుకి వెళ్లి రావడం కోసం బస్సు లో కార్ లో ట్రావెల్ చెయ్యడానికి కేటాయిస్తే ఇంక పని చేసేవాళ్ళు కంపనీలు పెట్టడానికి టైం ఎక్కడ దొరుకుతుంది...

 

అందుకని జాబ్స్ చేస్తూ సైడ్ లో ఇలా కంపనీ రన్ చేస్తూ ఉండాలి..

ప్రస్తుతానికి డబ్బులు అవసరాలు కోసం పని చేసినా సరే,  నా కుటుంభానికి ఇంకొకరు జీతం ఇస్తేనే తిండి అన్నట్టుగా కాకుండా ఎప్పటికైనా జాబ్ మానేసి, సొంతంగా సంపాదించుకునేలా సైడ్ లో ఒకటి రెడీ చేసుకుంటూ వ్యాపార అనుభవం తెచ్చుకుంటూ ఉండాలి...

అప్పుడే కుటుంబానికి ఒక ఆధారం నమ్మకం ఉంటుంది...

 

మన ఇంట్లో పని మనిషిని మనం ఎప్పుడు పీకేస్తామొ అని ఆవిడకు భయం ఉంటుందిగా, అదే భయం అన్ని రకాల పనులు చేసేవాళ్లకు ఉంటాయి...

ఇప్పటి నుంచే అలోచించి చేసుకుంటూ ఉంటె గానీ సొంత సంపాదన అలవాటు కాదు .....

Comments

Popular posts from this blog

sari saree business from 5 lacto 200 crore turnover - missamma handlooms - dileep golli